ఈ రోజు మోడరన్ స్టెల్లార్ స్కూల్ లో “గ్రీన్ కలర్ డే సెలబ్రేషన్స్” ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో నర్సరీ, LKG,UKG చిన్నారులు వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.చిన్నారులు అందరూ ఆకుపచ్చని రంగు దుస్తులలో, సీతాకోక చిలుకల వేషధారణలతో,రామ చిలుక,డైనోసార్,తాబేలు,సన్ ఫ్లవర్,మామిడిపండు,ద్రాక్ష చెట్టు వంటి వివిధ ఆకు పచ్చని రంగు వస్త్రధారణలతో సందడి చేశారు., బాల్స్, కేక్స్, చాకొలేట్స్, బిస్కేట్స్, టెడ్డీ బేర్స్,బెలూన్స్, క్యాప్స్ ఇలా అన్ని రకాల వస్తువులతో అలంకరించి ఆట పాటలతో అలరించారు. వివిధ రకాల వస్తువుల గురించి ఎంతో ఆసక్తి తో తెలుసుకుంటూ ఆటపాటలతో వాటిని వివరిస్తూ ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారు..ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒత్తిడితో కాకుండా, ఆడుతూ పాడుతూ ఎక్కువ విషయాలను చాలా తక్కువ సమయంలో సులభరీతిలో నేర్చుకోవటానికి అవకాశం కలుగుతుందని మోడరన్ విద్యాసంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవులపల్లి ఫణి కుమార్ మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయిలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు